నవతెలంగాణ – మిర్యాలగూడ
పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ప్రేమచంద్ మంగళవారం హుజూర్నగర్లో జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా అండర్-14 కబడ్డీ విభాగంలో ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ధర్మానాయక్ తెలిపారు. బుధవారం ఆయన పాఠశాలలో విద్యార్ధి ప్రేమచంద్ను అభినందించి మాట్లాడారు. ప్రేమచంద్ జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చాటి ఈనెల 16, 17, 18 తేదీల్లో హైద్రాబాద్ పటాన్ చెరువులో జరిగే రాష్ట్ర స్థాయిల కబడ్డీ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి మంచి భవిష్యత్తును ఏర్పరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయురాలు వినోద, ఉపాధ్యాయులు కుర్ర కృష్ణకాంత్నాయక్, ఉపేందర్, ముంతాజ్బేగం, తావుర్యా, సంతోష్, అనిత, జ్యోతి, ధనలక్ష్మి, అశ్విని, స్పందన, బేబిరాణి, వినోద, కాంతయ్య, జానయ్య, జంగయ్య, స్వామి, లక్ష్మయ్య, మీనా, భవాని, రేణుక తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ప్రేమచంద్ ఎంపిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES