శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, స్పిరిట్ మీడియా బ్యానర్ల మీద నిర్మించిన చిత్రం ‘ప్రేమంటే’. ‘థ్రిల్లు ప్రాప్తిరస్తు అనేది’ ఉప శీర్షిక. సొనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్ దాస్ కె నారంగ్ దివ్యాశీస్సులతో జాన్వీ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా తెరకెక్కించారు. ఈ మూవీలో ప్రియదర్శి, ఆనంది జంటగా నటించారు. ఈ సినిమాకు నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా, ఆదిత్య మేరుగు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ ఈనెల 21న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం లవ్ ట్రోట్టర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నాగ చైతన్య, డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. నాగ చైతన్య మాట్లాడుతూ, ‘నవనీత్ మంచి పాయింట్‌తో కొత్త ప్రేమ కథను అందివ్వబోతున్నారు. ప్రియదర్శి మంచి నటుడు. అన్ని రకాల పాత్రల్ని అద్భుతంగా పోషిస్తున్నారు.
ఆనంది మంచి నటి. సుమని ఇలాంటి ఓ మంచి పాత్రలో చూడటం ఆనందంగా ఉంది. ‘ప్రేమంటే’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ”ప్రేమంటే’ టీంకి కంగ్రాట్స్. ప్రియదర్శిని చాలా ఏళ్ల నుంచి గమనిస్తూనే ఉంటున్నాను. ఆయనెప్పుడూ మంచి కథల్నే ఎంచుకుంటూ ఉంటారు. నవనీత్ ఈ మూవీతో మంచి విజయం దక్కాలి. ఆనంది అద్భుతమైన నటి. ఆమె నటించిన చిత్రాలెన్నో చూశాను. యంగ్ టాలెంట్ ప్రస్తుతం ఇండిస్టీలో ఎక్కువగా వస్తోంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నాను’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పారు. వీడియో బైట్ ద్వారా రానా దగ్గుబాటి, సురేష్ బాబు, నిర్మాత జాన్వీ నారంగ్, సుమ కనకాల, హీరో ప్రియదర్శి, హీరోయిన్ ఆనంది, డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్, హైపర్ ఆది, లియోన్ జేమ్స్, కెమెరామెన్ విశ్వనాథ్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ అరవింద్ మాట్లాడుతూ, డైలాగ్ రైటర్ రాజ్ కుమార్, లిరిక్ రైటర్ సనారే తదితరులు ఈ వేడుకలో పాల్గొని, చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
‘ప్రేమంటే’ పెద్ద హిట్ ఖాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



