- Advertisement -
నవతెలంగాణ – జన్నారం..
మండలంలోని వివిధ గ్రామాలలో జరిగే స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సామాగ్రిని తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మండలంలోని 29 గ్రామపంచాయతీలలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని ఎంపీడీవో కార్యాలయ అధికారులు మంగళవారం సిద్ధం చేశారు. వాటిని ఆయా గ్రామాల్లోని పోలింగ్ బూత్లకు తరలించి ఎన్నికలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని మండల అధికారులు వివరించారు.
- Advertisement -



