Saturday, April 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహనీయుల వేడుకలకు సన్నాహాలు

మహనీయుల వేడుకలకు సన్నాహాలు

- Advertisement -

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

దేశ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌ రావ్‌, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలను ఈనెల 5, 14 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తెలిపారు.శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వద్ద ఇందుకు సంబంధించి వివిధ దళిత సంఘాల నాయకులు, కళాకారులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశా నిర్వహించారు. వేడుకల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలు, విగ్రహాల వద్ద కార్యక్రమాల రూపకల్పన, ప్రజల సౌకర్యాలపై సమగ్రంగా చర్చించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -