మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో రానున్న జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలకు సన్నద్ధం కావాలని మాజీ శాసన సభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి నాయకులు, కార్యకర్తలును కోరారు. శనివారం బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరై, మాట్లాడారు. రానున్న జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు గ్రామ స్థాయి నుండి నాయకులు కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జడ్పిటిసి, ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించే దిశగా నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెడ్డి, మాజీ జిల్లా గ్రంథలయం చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి సుబ్బూరు బీరు మల్లయ్య, మాజీ ఎంపీపీ అతికం లక్ష్మీనారాయణ గౌడ్, బిఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు జనగాం పాండు, నీల ఓంప్రకాష్ గౌడ్, మాజీ సింగిల్ విండో చైర్మన్లు ఎడ్ల సత్తిరెడ్డి, బల్గురి మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు కేశపట్నం రమేష్, జక్క రాఘవేందర్ రెడ్డి, ర్యాకల శ్రీనివాస్, కంచి మల్లయ్య, అబ్బగాని వెంకట్ గౌడ్, సందెల సుధాకర్, సింగిరెడ్డి నర్సిరెడ్డి, కస్తూరి పాండు, సిల్వరు ఏసు, సుబ్బూరు రమేష్, కంకల కిష్టయ్య, పుట్ట వీరేశం, చిందం మల్లికార్జున్, జడల యాషిల్ లు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES