Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నులి పురుగుల నివారణపై సన్నాహక సమావేశం..

నులి పురుగుల నివారణపై సన్నాహక సమావేశం..

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం తేదీ11-08-2025 పురస్కరించుకొని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ , ఎయిడెడ్ , పాఠశాలల్లో విద్యార్థులకు ఆల్బెండ జోల్ మాత్రలను వేసే విధంగా చర్యలు చేపట్టాలనీ కిసాన్ నగర్ మెడికల్ ఆఫీసర్  డాక్టర్ స్రవంతి, మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ సూచించారు. ఈ సందర్భంగా ఎన్ డి డి యాక్షన్ ప్లాన్ ను వివరించారు. 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వారికి సగం మాత్ర, 2 నుండి 19 సంవత్సరాల వారికి పూర్తి మాత్ర ఇవ్వాలనీ ఇది నమిలి మింగాలని కోరారు. ఈ మాత్రల వలన ఎలాంటి ఇబ్బంది ఉండదని, ప్రోగ్రాం అధికారులు ఎ ఎన్ ఎమ్ లు, ఆశా వర్కర్లు, ఇతర వైద్య సిబ్బంది వారికి కేటాయించిన పాఠశాలలను పర్యవేక్షిస్తారన్నారు.ఈ కార్యక్రమంలో  పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, నోడల్ అధికారులు హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img