నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో బుధవారం సర్పంచ్ ల అధ్యక్షతన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించనున్న గ్రామసభల నిర్వహణ ఏర్పాట్లపై సన్నాహక సమావేశాలను నిర్వహించారు. నాగాపూర్, కమ్మర్ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, కోన సముందర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ సభల ఏర్పాట్లపై సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థాయి అన్ని శాఖల ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులకు, పంచాయతీ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. గ్రామాల్లో గ్రామసభల నిర్వహణపై టామ్ టామ్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు. గ్రామ సభలకు పెద్ద ఎత్తున హాజరయ్యాలా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామ సభలకు హాజరయ్యే ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు టెంట్లు, నీటి వసతిని ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.



