కాలుర్ చెరువును సందర్శించిన మున్సిపల్ కమిషనర్
నవతెలంగాణ – కంఠేశ్వర్ : మొక్కలు నాటేందుకు మున్సిపల్ అధికారులు ప్రణాళిక చేశారు. అందులో భాగంగా శుక్రవారం మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ అధికారులతో కలిసి ఉమెన్ ఫర్ ట్రీస్ చొరవలో భాగంగా స్థానిక కలూర్ చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మున్సిపల్ కమిషనర్ ఎస్. దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వచ్చే జూన్ 5, 2025 నుండి చెరువు కట్ట వెంబడి దాదాపు 400 మొక్కలు నాటడానికి ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. మొక్కలను పోషించే బాధ్యత స్థానిక మహిళా సంఘాలకు అప్పగించబడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES