Wednesday, October 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజెడ్పీటీసీ అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయండి

జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయండి

- Advertisement -

ఐదో తేదీ నాటికి ప్రతి జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లు పంపండి
అర్హులకు అన్యాయం జరగొద్దు : మంత్రులతో జూమ్‌ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఒక్కో మండలం నుంచి ముగ్గురు పేర్లతో కూడిన ప్రతిపాదిత అభ్యర్థుల జాబితాను ఐదో తేదీ నాటికి రాష్ట్ర కేంద్రానికి పంపాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం మంత్రులతో జూమ్‌ మీటింగ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌ నిర్వహించారు. ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ముఖ్యనాయకులతో సంప్రదించి ప్రతి జెడ్పీటీసీ స్థానం నుంచి ముగ్గురు అర్హులైన అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించాలని సీఎం సూచించారు. అన్ని రకాలుగా అర్హులైన అభ్యర్థులను పీసీసీ ఎంపిక చేస్తుందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గెలుపే లక్ష్యంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పనిచేయాలని సూచించారు.

మంత్రి పొన్నం ఇంట్లో కాంగ్రెస్‌ బీసీ నేతల భేటీ
హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలోని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇంట్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బీసీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. అందులో పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రులు పొన్నం, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, సీనియర్‌ నాయకులు వీహెచ్‌, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, ప్రభుత్వ విప్‌లు ఆదిశ్రీనివాస్‌, బీర్ల ఐలయ్య, అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. న్యాయపరమైన అంశాల్లో రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై సమాలోచనలు జరిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. గవర్నర్‌, రాష్ట్రపతి వద్ద ఉన్న పెండింగ్‌ బిల్లులు మూడు నెలలకు మించి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకోవచ్చునని తమిళనాడు విషయంలో కోర్టు తీర్పు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -