రిటర్నింగ్ ఆఫీసర్‌గా రాజ్యసభ సెక్రెటరీ జనరల్ పి.సి మోడీ
న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించటంలో భాగంగా ఎన్నికల సంఘం (ఈసీ) తదుపరి చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా రాజ్యసభ సెక్రెటరీ జనరల్ పి.సి మోడీని రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఓ)గా నియమించింది.అలాగే ఎగువ సభకు చెందిన ఇద్దరు సెక్రెటేరియట్ అధికారులను అసిస్టెంట్ ఆర్‌ఓలుగా అపాయింట్ చేసింది. జాయింట్ సెక్రెటరీ గరిమా జైన్, డైరెక్టర్ విజరు కుమార్‌లు అసిస్టెంట్ ఆర్‌ఓలుగా ఉంటారని పోల్ ప్యానెల్ తెలిపింది. సోమవారం ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన విషయం విదితమే. ఆరోగ్య కారణాలను పేర్కొంటూ ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో రాష్ట్రపతి ఎన్నిక అనివార్యంగా మారింది.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సన్నద్ధం
- Advertisement -
- Advertisement -