- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో 10 గ్రామ పంచాయతీల పరిధిలోని 17 గ్రామ సంఘాలకు గ్రామ సంఘ భవనాల మంజూరి కోసం ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డికి గ్రామ పంచాయతీల నుండి పొందిన తీర్మానాల పత్రాన్ని సమర్పించినట్లు ఐకెపి ఎపిఎం సాయిలు తెలిపారు. గ్రామ సంఘాలకు స్వంత భవనాలు మంజూరు కావడం ద్వారా మహిళా సంఘాల కార్యకలాపాలకు మరింత బలపడుతుందన్నారు. సంబంధిత తీర్మానాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో తెలిపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపిఓ రాజు, భిక్కనూర్ పంచాయతి కార్యదర్శి మహేష్ గౌడ్, ఐకెపి సిబ్బంది అన్న పూర్ణ, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



