Monday, February 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యతోనే సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ

విద్యతోనే సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ

- Advertisement -

కేంద్ర మంత్రి భూపతి రాజ్‌ శ్రీనివాస్‌వర్మ, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌
నవతెలంగాణ-తాండూరు

నేటి తరం పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే విద్య అవసరమని కేంద్ర మంత్రి భూపతిరాజ్‌ శ్రీనివాస్‌వర్మ, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ అన్నారు. ఆదివారం వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలంలోని జీనుగుర్తి గ్రామంలో ఏకలవ్య గ్రామీణ్‌ వికాస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సందీపని గురుకులం ఆవరణలో పలు భవనాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల కార్యక్రమంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, కేంద్ర మంత్రి భూపతి రాజ్‌ శ్రీనివాస్‌ వర్మ, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, బాగయ్య, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన జిన్‌గుర్తి గ్రామంలో ఏకలవ్య గ్రామీణ్‌ వికాస్‌ ఫౌండేషన్‌ ద్వారా చేస్తున్న సేవలు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయన్నారు. విద్యను వ్యాపారం చేయకూడదనే ఉద్దేశంతో కొనసాగుతున్న ఏకలవ్య ఫౌండేషన్‌కు ఎల్లప్పుడూ తమ వంతు సహాకారం ఉంటుందని తెలిపారు. ధీర్ఘకాలిక లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్‌ అతి తక్కువ సమయంలోనే భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ప్రముఖులను ఫౌండేషన్‌ ఒకే వేదిక పైకి తేచ్చిందన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి దేశానికి నాయకత్వం వహించే ఎంతో మంది నాయకులు, ఐఏఎస్‌లు, శాస్త్రవేత్తలు, డాక్టర్స్‌, లాయర్లను, అధికారులను ఫౌండేషన్‌ అందించబోతుందన్నారు. స్పీకర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటుచేస్తున్న ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్సియల్స్‌ పాఠశాలను మన తాండూర్‌లో నిర్మిస్తున్నారని, పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. యువతకు సాంకేతిక విద్యను అందించాలనే ఉద్దేశంతో తాండూర్‌లో ఏటీసీ సెంటర్‌ను సైతం ప్రారంభించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, వికారాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మెన్‌ ఎ.ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎస్పీ స్నేహ మెహ్రా, సిలికాన్‌ కాలిఫోర్నియా ఏపీ కూచిభొట్ల ఆనంద్‌, సాందీపని గురుకులం చైర్మెన్‌ డాక్టర్‌ సి.మల్లారెడ్డి, ఏకలవ్య గ్రామీణ వికాస్‌ ఫౌండేషన్‌ చైర్మెన్‌ డాక్టర్‌ పి.వెంకటేశ్వరరావు, పలువురు ప్రముఖులు, అధికారులు, ఏకలవ్య ఫౌండేషన్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -