Friday, November 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబేగంపేట‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము.. స్వాగ‌తం ప‌లికిన సీఎం రేవంత్‌రెడ్డి

బేగంపేట‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము.. స్వాగ‌తం ప‌లికిన సీఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: భారత రాష్ట్రపతి ద్రౌపదీముర్ము హైదరాబాద్‌ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌ రెడ్డి, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన, హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తదితరులు ఉన్నారు.

బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో జరిగే భారతీయ కళా మహోత్సవాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. సాయంత్రం 6.15 గంటలకు తిరిగి రాజ్ భవన్ కు చేరుకుంటారు. అక్కడే బస చేసి మరుసటి రోజైన శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి బయలుదేరి వెళ్లనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -