- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సోమవారం భారతదేశపు అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం అశోక చక్రను ప్రదానం చేశారు. దేశ రాజధానిలో కర్తవ్య పథ్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి శుక్లాకు ఈ అవార్డును అందజేశారు.
కాగా, అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ఆక్సియం స్పేస్ అమలు చేసిన ఆక్సియం -4 మిషన్‌లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఇఎస్‌ఎ) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) పాల్గొన్నాయి. ఈ మిషన్‌కు గ్రూప్ కెప్టెన్‌గా శుక్లా వ్యవహరించారు.
- Advertisement -



