నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండ్‌లో విహరించారు. సుమారు 25 నిమిషాల పాటు ఆమె సోర్టీ నిర్వహించారు. భారత్, పాకిస్థాన్ బోర్డర్‌లో ఉన్న జైసల్మేర్ జిల్లాలో ముర్ము విహరించారు. జైసల్మేర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి హెలికాప్టర్ టేకాఫ్ తీసుకున్నది. టేకాఫ్‌కు ముందు ఆ హెలికాప్టర్ గురించి రాష్ట్రపతి ముర్ముకు కెప్టెన్ బ్రీఫింగ్ ఇచ్చారు. కాక్‌పిట్ నుంచి ఆమె చేతులు ఊపారు. సైనిక దళాల సుప్రీం కమాండర్ హోదాలో ముర్ము విహరించారు.
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ఎల్‌సీహెచ్ ప్రచండ హెలికాప్టర్‌ను నిర్మించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని డిజైన్ చేసి డెవలప్ చేశారు. అడ్వాన్స్‌డ్ ఏవియానిక్స్, స్టీల్త్ ఫీచర్స్, నైట్ అటాక్ కెపాసిటీ, ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ తీసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉన్నది.



