నవతెలంగాణ-హైదరాబాద్: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించే తీర్మానానికి పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపింది. బీహార్‌లో ఎస్‌ఐఆర్‌పై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాల ఆందోళనల మధ్య గతవారం లోక్‌సభ ఈ తీర్మానాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే.
హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కోర్టు తీర్పు కారణంగా మణిపూర్‌లో రెండు జాతుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. మత హింస అని కొందరు పేర్కొంటున్నారని, అది తప్పని అన్నారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించి ఎనిమిది నెలలు అవుతోందని, ఈ సమయంలో ఒకే ఒక్క హింసాత్మక ఘటన మాత్రమే నమోదైందని అన్నారు. అనంతరం రాజ్యసభ మూజువాణి ఓటుతో తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ఆమోదించడం ‘జ్యాంగ బాధ్యత’ అని చైర్మన్ హరివంశ్ తెలిపారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనకు విధించిన ఎనిమిది నెలల గడువు ఆగస్ట్ 13తో ముగియనుంది.