నవతెలంగాణ-హైదరాబాద్: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు యూనియన్ హోంమంత్రితత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మెయిటీ వర్గానికి చెందిన 62 ఏళ్ల ఖేమ్‌చంద్ సింగ్‌ను నూతన సీఎం ఎన్నికయ్యారు. ఆయన గతంలో బిరేన్ సింగ్ ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా పనిచేశారు. 2022లో ఆయన ముఖ్యమంత్రి పదవికి పోటీదారుగా నిలిచారు.
గత ఏడాది ఫిబ్రవరి 13న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఫిబ్రవరి 9, 2025న మణిపూర్ ముఖ్యమంత్రి పదవికి ఎన్ బిరెన్ సింగ్ రాజీనామా చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. 2023 మే 3న కుకి-జోమి వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలతో తీవ్ర ఉద్రితక్తలకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి.ఈ ఘర్షణలు వందలాది మంది మరణాలకు దారితీసింది. వేలాది మంది నిరాశ్రయులైయ్యారు.



