Wednesday, January 7, 2026
E-PAPER
Homeనల్లగొండసూర్యాపేటకు ఆత్మ‌గౌర‌వ‌ ప్రతీక "ప్రెస్ క్లబ్"

సూర్యాపేటకు ఆత్మ‌గౌర‌వ‌ ప్రతీక “ప్రెస్ క్లబ్”

- Advertisement -
  • టీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు- కందుకూరి యాదగిరి
    నవతెలంగాణ- సూర్యాపేట కలెక్టరేట్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల ఆత్మగౌరవ ప్రతీక సొంత “ప్రెస్ క్లబ్” భవనం లేకపోవడం విచారకరమని సీనియర్ పాత్రికేయులు భూపతి రాములు గౌడ్, సుంకర బోయిన వెంకటయ్య యాదవ్ అన్నారు. సోమవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో.. పాత బస్టాండు నుండి పీఎస్ఆర్ సెంటర్ వాణిజ్య భవనం శంకర్ విలాస్ సెంటర్ మీదుగా గాంధీ బొమ్మ వరకు శాంతియుత పాదయాత్రకు మద్దతు ఇచ్చారు ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయ్యేందుకు అసోసియేషన్లకు యూనియన్లకు అతీతంగా.. ఎవరు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఉద్యమాలకు పిలుపునిచ్చిన తాము తప్పకుండా పాల్గొంటామని తెలిపారు.ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో సొంత భవనం లేక జర్నలిస్టులు చెట్ల కింద ప్రైవేటు భవనాల కింద హోటలలో టీ స్టాల వద్ద గడపాల్సిన దుస్థితి ఏర్పడిందని సమాజానికి అక్షరాల కాంతులను నింపి ప్రజలను చైతన్య పరుస్తున్న ఫోర్త్ ఎస్టేట్ గా కొనసాగుతున్న మీడియా ప్రతినిధులకు నిలువనీయుడా లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

అదేవిధంగా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాలు ఇందిరమ్మ ఇండ్లు ఇన్సూరెన్సులు ఇవ్వాలని కోరారు. వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు ఇచ్చి దాని ద్వారా రాష్ట్రంలో ఎక్కడికైనా ఎలాంటి చార్జీలు లేకుండా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఇంకా జర్నలిస్టులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని అవన్నీ పరిష్కరించే వరకు తాము దఫలవారీగా ఉద్యమం చేపడతామని, తెలంగాణ సాధించుకోవడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని ప్రభుత్వాలు నిలబడాలన్న కూలిపోవాలన్న జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉంటుందని, ప్రభుత్వం జర్నలిస్టులను విస్మరించకుండా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భ‌వ‌న్ సాధ‌న కోసం అన్ని యూనియన్ల వారు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్జెఏ అసోసియేషన్ జర్నలిస్టులతో పాటు ఇతర యూనియన్లకు సంబంధించిన పలువురు సీనియర్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -