- Advertisement -
నవతెలంగాణ -ముధోల్
మండల కేంద్రమైన ముధోల్ లో బుధవారం ముధోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు షఫీ ఉల్లా ఖాన్ (బాబా), ఉపాధ్యక్షులు కోలేకర్ పోతాజీ, ప్రధాన కార్యదర్శి పీసర శ్రీనివాస్ గౌడ్, సలహాదారుడు డోంగ్రె చంద్రమణిను బంజారా సేవా సంఘం జిల్లా నాయకులు రాథోడ్ నరేందర్ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడంలో పాత్రికేయులు కీలకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో మీడియా ముఖ్యభూమికను పోషిస్తున్నదని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -