Wednesday, May 21, 2025
Homeరాష్ట్రీయంనేరాలను అరికట్టండి.. ఆదాయాన్ని పెంచండి

నేరాలను అరికట్టండి.. ఆదాయాన్ని పెంచండి

- Advertisement -

తెలంగాణ ఎక్సైజ్‌ కమిషనర్‌ సి.హరికిరణ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మత్తు పదార్థాలు, అక్రమ మద్యం తదితర నేరాలను అరికట్టడంతో పాటు అబ్కారీ శాఖకు ఆదాయాన్ని పెంచడంపై దృష్టి సారించాలని తెలంగాణ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సి.హరికిరణ్‌ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని అబ్కారీ భవన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీంతో కలిసి ఎక్సైజ్‌ అధికారుల పని తీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. జనవరి 25 నుంచి ఏప్రిల్‌ వరకు నాలుగు నెలల్లో రాష్ట్రంలోని ఎక్సైజ్‌ క్రైమ్‌ రేట్‌, ఆదాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గంజాయి, డ్రగ్స్‌తోపాటు మిథనాల్‌ వినియోగంపై గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు. కామారెడ్డిలో జరిగిన ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్‌డీపీఎల్‌ మద్యాన్ని అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే హరితహారం కార్యక్రమంలో ఎక్సైజ్‌శాఖకు ప్రభుత్వం నిర్దేశించిన 25 లక్షల తాటి, ఈత వనాలను నాటేందుకు అన్ని జిల్లాల అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. త్వరలో కానిస్టేబుళ్ల నుంచి అధికారుల వరకు అన్ని స్థాయిల్లో పదోన్నతులు, బదిలీలు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ సయ్యద్‌ యాసిన్‌ ఖురేషి, జాయింట్‌ కమిషనర్లు కేఏబీ. శాస్త్రీ, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -