తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ క్యూబ్, యుఎఫ్‌ఓ, పీఎక్స్‌డీ అధిక యూజర్ ఛార్జీలు, సినిమా థియేటర్స్‌లో తిను బండారాల ధరలు, సినిమా పైరసీకి వ్యతిరేకంగా తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయం దగ్గర బుధవారం మహాధర్నా నిర్వహించారు. టీఎఫ్‌సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ సారథ్యంలో జరిగిన ఈ మహాధర్నాలో నిర్మాతలు లయన్ సాయి వెంకట్, గురురాజ్, డీఎస్‌రెడ్డి, రవి, హీరో సన్నీ, దర్శకుడు సిరాజ్‌తో పాటు పలువురు దర్శక, నిర్మాతలు, ఆర్టిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎఫ్‌సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, పరిశ్రమలోని ముగ్గురు నిర్మాతలు తమ స్వార్థంతో చేస్తున్న నిర్వాకాల వల్ల చిన్న సినిమా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ క్యూబ్, యూఎఫ్‌వో, పీఎక్స్‌డీ తెలుగు నిర్మాతల నుంచి వారానికి పది వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.
దీంతో ఒక్కో సినిమా రిలీజ్‌కు కనీసం రూ.10 లక్షల భారాన్ని నిర్మాతలు మోయాల్సి వస్తోంది. మల్టీప్లెక్స్‌లో అయితే వారానికి రూ.15 వేలు నిర్మాత చెల్లించాలి. ఇదే పక్క రాష్ట్రాల్లో 2500 నుంచి 3 వేల రూపాయల మాత్రమే ఛార్జీలు ఉన్నాయి. మన దగ్గర మాత్రం ఇంత అధిక ధరలు ఎందుకు చెల్లించాలి? ఆ ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఈ డిజిటల్ ప్రొవైడింగ్ కంపెనీల్లో పార్టనర్స్‌గా ఉంటూ పరిశ్రమను లూటీ చేస్తున్నారు. అలాగే థియేటర్స్‌లో వందల రూపాయలు తినుబండారాలకే ఖర్చువుతోంది. టికెట్ రేట్లు భారీగా ఉంటున్నాయి. దీంతో సామాన్య ప్రేక్షకుడు చిన్న సినిమాను థియేటర్స్‌లో చూసేందుకు రావడం లేదు. ఏడాదిలో రిలీజయ్యే 250 చిత్రాల్లో 200 చిన్న చిత్రాలే ఉంటున్నాయి. అలాంటి చిన్న సినిమా ఈ రోజున బతికే పరిస్థితి లేదు. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి. టీఎఫ్‌సీసీ తరుపున మా పోరాటం కొనసాగిస్తాం. సదరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఇంటి ముందు ధర్నాలు చేస్తాం. పైరసీ అరికట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన చర్యలు అభినందనీయం’ అని అన్నారు.
డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీని అడ్డుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



