Sunday, March 15, 2026
E-PAPER
Homeఖమ్మంఅసాంఘిక కార్యకలాపాలు నివారణ ప్రతీ పౌరుడి బాధ్యత 

అసాంఘిక కార్యకలాపాలు నివారణ ప్రతీ పౌరుడి బాధ్యత 

- Advertisement -

– పేకాట, కోడిపందాలు సమాచారం 100 ఫోన్ చేయండి 
– ఎస్ హెచ్ ఓ యయాతి రాజు 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

సామాజిక రుగ్మతలను, అసాంఘిక కార్యకలాపాలు నివారణ ప్రతీ పౌరుడి బాధ్యత అని ఎస్ హెచ్ ఓ ఎస్సై యయాతి రాజు అన్నారు.

అశ్వారావుపేట మండలం  సోమవారం ఆసుపాక శివారులోని అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులపై అశ్వారావుపేట పోలీసులు మెరుపు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 52 పేక ముక్కలు,రూ.12,800 లు నగదు,మూడు మోటార్ సైకిల్ లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. పేకాట, కోడిపందాల వంటి జూదాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు సమాచారం కోసం డయల్ 100 కి కాల్ చేయవలసిందిగా కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -