Thursday, May 22, 2025
Homeరాష్ట్రీయంలిఫ్ట్‌ల్లో ప్రమాదాల నివారణ చర్యలునివేదించండి

లిఫ్ట్‌ల్లో ప్రమాదాల నివారణ చర్యలునివేదించండి

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అపార్ట్‌మెంట్లల్లో ఏర్పాటు చేస్తున్న లిఫ్ట్‌ల్లో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారనీ, ప్రమాదాల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లిఫ్ట్‌ల ఏర్పాటు, నిర్వహణలో నిబంధనలు అమలు చేయకపోవడంతో పలుచోట్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయంటూ ఓ వ్యక్తి హైకోర్టుకు లేఖ రాశారు. ఇటీవల ముగ్గురు మహిళలు గాయపడటం, నాలుగేళ్ల బాలుడితోపాటు ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌ మృతి చెందిన సంఘటనలను ప్రస్తావించారు. ఈ లేఖను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజరుపాల్‌, జస్టిస్‌ యారా రేణుకలతో కూడిన బెంచ్‌ ఇటీవల విచారణ చేపట్టింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ప్రజల భద్రతకు ఏం చర్యలు తీసుకుంటు న్నారో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వేసవి సెలవుల తరువాత వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -