నవతెలంగాణ – మహదేవపూర్
మహదేవపూర్ మండలం సూరారం రైతు వేదిక వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబడి పెళ్లిలో గ్రామంలో పురోహితం చేస్తున్న నాగరాజ్ శర్మ (36 ) మృతి చెందారు. పూర్తి వివరాలకు వెళితే మహాదేవపూర్ గ్రామానికి చెందిన నాగరాజ్ శర్మ అంబటి పెళ్లి గ్రామంలో ఆలయంలో పురోహితం చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్నారు శుక్రవారం మధ్యాహ్నం అంబటిపల్లి గ్రామంలో ఒక వివాహం చేసి అనంతరం మహాదేవపూర్ పోయి రాత్రి తిరుగు ప్రయాణంలో సూరారం రైతువేదిక వద్ద రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయినట్టు గ్రామస్తులు తెలిపారు అడవి పంది రోడ్డుకు వడ్డం వచ్చిందా లేదా అదుపుతప్పి చనిపోయిండా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది పోస్టుమార్టం మృతదేహాన్ని మహాదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు
రోడ్డు ప్రమాదంలో పూజారి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



