Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్చక, ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి 

అర్చక, ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి 

- Advertisement -

అర్చక ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డివిఆర్ శర్మ 
నవతెలంగాణ – పాలకుర్తి

రాష్ట్రంలోని ఆలయాల్లో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలని అర్చక, ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్  డివిఆర్ శర్మ అన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్చార్జి కమిషనర్ గా శైలజ రామయ్యర్ ను ప్రభుత్వం నియమించడంతో డివిఆర్ శర్మ పాలకుర్తి ల గల శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ప్రసాదాన్ని శనివారం హైదరాబాదులో గల దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఇన్చార్జి కమిషనర్ కు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డివిఆర్ శర్మ మాట్లాడుతూ దేవాదాయ, ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగులకు పెన్షన్, హెల్త్ కార్డు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు.  పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, ఆలయాల అభివృద్ధికి పాటుపడాలని, ఆలయాల పేరున ఉన్న ప్రభుత్వ భూములను కాపాడి సంరక్షించుకోవాలని కోరానని తెలిపారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కావడంతో ఆలయాలకు ఎలాంటి ఆదాయం రావడంలేదని, ఆలయాల భూములతో ఆలయాల అభివృద్ధికి ఆదాయం వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. సమస్యలపై ఇన్చార్జి కమిషనర్ స్పందించారని తెలిపారు. ఆలయాలకు వచ్చే భక్తులకు దేవాదాయ, ధర్మాదాయ శాఖల నుండి మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు చేపడతామని ఇన్చార కమిషనర్  శైలజ రామయ్యర్ హామీ ఇచ్చారని తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -