నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’కు ఆమోదం తెలిపింది. వ్యవసాయ, అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఏటా రూ.24వేల కోట్ల వ్యయంతో దేశ వ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ ప్రోగ్రామ్‌ని అమలు చేయనున్నారు. 2025-26 నుంచి ఆరేళ్ల కాలానికి 100 జిల్లాలను కవర్ చేసేలా దీన్ని చేపట్టనున్నారు.
అలాగే, పునరుత్పాదక ఇంధనంలో ఎన్‌టీపీసీకి రూ.20వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, రోదసిలో 18 రోజులు గడిపి, అనేక ప్రయోగాలను నిర్వహించి విజయవంతంగా భూమికి తిరిగివచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.