Thursday, November 27, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రారంభోత్సవానికి ప్రధానికి ఆహ్వానం

గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రారంభోత్సవానికి ప్రధానికి ఆహ్వానం

- Advertisement -

అతిథులకు లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు : సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రారంభోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించనున్నట్టు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తెలిపారు. డిసెంబరు 8, 9 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లపై హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉన్నతాధికారు లతో సీఎం సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రులతో పాటు సమ్మిట్‌కు ఆహ్వానించాల్సిన దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రముఖుల జాబితా ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. సమ్మిట్‌కు వచ్చే అతిథులకు ఎలాంటి లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయా లని ఆదేశించారు. పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో ప్రణాళిక ప్రకారం వ్యవహరించాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు 2,600 మందిని ఆహ్వానించినట్టు అధికారులు ఈ సందర్భం గా సీఎంకు వివరించారు.

సంక్షేమం, వైద్యం, పరిశ్రమలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తదితర విభాగాల స్టాళ్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. సమ్మిట్‌లో స్టాళ్ల ఏర్పాటుకు సంబంధించిన డిజైన్లను సీఎంకు అధికారులు వివరించారు. ప్లీనరీలో విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించిన పక్కా ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. ఒక్కో ఈవెంట్‌కు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి బాధ్యత అప్పగించాలన్నారు. తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచేలా డ్రోన్‌ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. నెలాఖరులోగా గ్లోబల్‌ సమ్మిట్‌కు సంబంధిం చిన డిజైన్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -