Sunday, July 20, 2025
E-PAPER
Homeజాతీయంయూకే, మాల్దీవ్‌లకు ప్రధాని మోడీ

యూకే, మాల్దీవ్‌లకు ప్రధాని మోడీ

- Advertisement -

దౌత్య విభేదాల తర్వాత..తొలిసారి పర్యటన
న్యూఢిల్లీ :
ప్రధాని మోడీ విదేశీ పర్యటనలకు వెళ్తున్న తీరుపై ఇటు ప్రజల్లో, అటు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. వచ్చే వారంలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. జులై 23 నుంచి 26 వరకు యూకే, మాల్దీవుల్లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. గతేడాది మోడీపై, లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. విభేదాల అనంతరం ప్రధాని ఆ దేశానికి వెళ్లడం ఇదే మొదటిసారి కావడంతో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మాల్దీవులతో బలమైన దౌత్య సంబంధాలు, పరస్పర ప్రయోజనాలు పునరుద్ధరించడానికి ఈ పర్యటన సహకరిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే మొదట 23-24 తేదీలలో యూకేలో జరగనున్న భారత్‌-బ్రిటన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై జరిగే చర్చల్లో మోడీ పాల్గొని..ఒప్పందంపై సంతకం చేయనున్నట్టు అధికారులు తెలిపారు. యూకే ప్రభుత్వంతో దౌత్య, వాణిజ్య చర్చలు జరపనున్నారు. అనంతరం జులై 25-26 తేదీలలో ప్రధాని మాల్దీవులకు వెళ్లనున్నారు. మాల్దీవుల 60వ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరవుతారు.
గతేడాది జనవరిలో లక్షద్వీప్‌ను సందర్శించిన ప్రధాని మోడీ.. సాహసాలు చేయాలనుకున్నవారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. ఇది ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను దెబ్బతీసే స్థాయికి చేరిన విషయం విదితమే. అయితే దేశవ్యాప్తంగా కీలకాంశాలు పార్లమెంట్‌లో ప్రస్తావకు వస్తున్నప్పుడే..యూకే, మాల్దీవ్‌ పర్యటనలకు ప్రధాని మోడీ సిద్ధమవ్వటంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -