Wednesday, May 7, 2025
Homeట్రెండింగ్ న్యూస్మోసగాళ్ళకే మోసగాడు ప్రధాని మోడీ: జగ్గారెడ్డి

మోసగాళ్ళకే మోసగాడు ప్రధాని మోడీ: జగ్గారెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బీజేపీ ఎంపీ రఘునందన్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై రఘునందన్ రావు చేసిన విమర్శలపై జగ్గారెడ్డి ఘాటుగా బదులిచ్చారు. మీరు మా సీఎంను తిడితే మేము మీ పీఎంను తిడతామని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో దేశ ప్రజల ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తామని అబద్దపు హామీలతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. మరి ఆ హామీ ఏమైందని సూటిగా ప్రశ్నించారు. మోసగాళ్ళకే మోసగాడు ప్రధాని మోడీ అన్నారు. మేము మీ నాయకున్ని తిడితే మీకెంత భాద ఉంటుందో.. మీరు మా నాయకున్ని తిడితే మాకు కూడా అంతే బాధ ఉంటుందని చెప్పుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -