- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని, ఆయన నటించిన పాత్రలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారని మోడీ అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోడీ ఆయనకు నివాళులర్పించారు. తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ విశిష్ట నటుడని పేర్కొన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు కృషి చేసిన గొప్ప దార్శనికుడని కొనియాడారు. ఎన్టీఆర్ నుంచి ఎంతో ప్రేరణ పొందామని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మోడీ తెలిపారు.
- Advertisement -