నవతెలంగాణ-హైదరాబాద్: జపాన్‌లో రెండు రోజుల పర్యటనంతరం ప్రధాని మోడీ చైనాకు చేరుకున్నారు. టియాంజిన్‌లో ఆగస్టు 31 – సెప్టెంబర్ 1 తేదీల్లో జరగనున్న షాంగై సహకార సంస్థ (ఎస్‌సిఓ) శిఖరాగ్ర సమావేశానికి హాజరకానున్నారు. అమెరికా విధించిన 50 శాతం సుంకాలు అమల్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో ఈ సమ్మిట్ భారత్‌కి చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఈ శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా హాజరుకానున్నారు.
కాగా, ఈ షాంగై సహకార సంస్థలో 10 సభ్య దేశాలున్నాయి. వాటిల్లో భారత్, బెలారస్, చైనా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లు ఉన్నాయి. ఈ సమావేశానికి ఈ దేశాధినేతలు హాజరుకానున్నారు.
