ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగం
ఎప్‌స్టీిన్ ఫైల్స్‌లో తొలిసారి మోడీ ఆడి పాడినట్టు నిర్థారణ
జెరూసలేం : ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌లో ఈ నెల 25, 26 తేదీల్లో పర్యటించనున్నారు. అక్కడి పార్లమెంట్‌లో ప్రసంగిస్తారు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం వెల్లడించారు. అమెరికాకు చెందిన యూదు సంస్థల అధ్యక్షులతో జరిగిన సమావేశంలో నెతన్యాహు మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. భారత్ సాధారణ దేశం కాదని, 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఇజ్రాయిల్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి కూడా మోడీ పర్యటన విషయాన్ని ధ్రువీకరించారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక అంశాలతో పాటు ప్రాంతీయ అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే, గత కొన్ని నెలల నుంచి ఇజ్రాయిల్, భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ పర్యటనలో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. గతేడాది నవంబర్‌లో ఇరు దేశాల మధ్య రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక సహకారం అంశాల్లో ఒక ఒప్పందం కుదిరింది. కాగా, మోడీకి ఇదో రెండో ఇజ్రాయిల్ పర్యటన కానుంది. 2017లో మోడీ తొలిసారిగా అక్కడ పర్యటించారు. దీనిపై అమెరికా జోక్యం ఉందని ఈ పర్యటనలోనే మోడీ ఆడి పాడారని ఎపిస్టీన్ ఫైల్స్ బయటపెట్టిన సంగతి తెలిసిందే.
మరోసారి ఇజ్రాయిల్‌కు ప్రధాని
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



