రాష్ట్ర స్థాయి సత్కారం అందజేత..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
2025-26లో మధ్యాహ్న భోజనం / పీ.ఎం.పోషణ్ యొక్క స్మార్ట్, వినూత్న, సమర్థవంతమైన అమలును ప్రోత్సహించడానికి, శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయంలో పాఠశాల విద్యా డైరెక్టర్, రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ద్వారా అత్యుత్తమ యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓ కందుల సత్యనారాయణను ప్రధానమంత్రి పోషణ రాష్ట్రస్థాయి సత్కారంతో సన్మానించారు.
రాష్ట్ర స్థాయిలో ఈ సత్కారం పొందిన ఇద్దరు డీ.ఈ.ఓ లలో యాదాద్రి భువనగిరి జిల్లా నుండి కందుల సత్యనారాయణ మొదటి వారు కావడంతో జిల్లావాసులు అభినందనలు తెలిపారు. కాగా ఈ గుర్తింపు,చొరవ క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందిని ప్రోత్సహించడం, జవాబుదారీతనం, శ్రేష్ఠతను ప్రోత్సహించడం కోసం ఉద్దేశించబడింది. ఈ గుర్తింపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల పిల్లలకు పోషకాహార మద్దతును సమర్థవంతంగా అందించడంలో మరింత బలోపేతం చేయడంలో ఉపయోగపడుతుందని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డా నవీన్ నికోలస్ అన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్(సర్వీసెస్ ) ఎం.మదన్మోహన్, అడిషనల్ డైరెక్టర్ ఉషారాణి పాల్గొని అభినందించారు.



