నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నాగర్ కర్నూల్ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్ శైలజ విద్యార్థినీలను వేధిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్న ప్రిన్స్‌పాల్‌ను సస్పెండ్ చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై స్వయంగా విద్యార్థినీలే జాతీయ రహదారిపై ఆందోళన చేశారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కమ్మదనం శివారులో నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో నిర్వహిస్తున్న నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యార్థినిలు వందలాదిగా గురుకులం నుండి పాదయాత్రగా వచ్చి షాద్ నగర్ పట్టణంలోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారని పేర్కొ న్నారు. తక్షణమే ప్రిన్సిపాల్ శైలజను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థినీలను వేధిస్తున్న ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి : కేవీపీఎస్ డిమాండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

                                    

