Sunday, December 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి : మంత్రి పొన్నం

రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి : మంత్రి పొన్నం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రభుత్వం రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. జనవరిలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వీటిని విజయవంతం చేయాలని రవాణాశాఖ ఉద్యోగులు, సిబ్బందిని కోరారు. శనివారంనాడాయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ప్రతి జిల్లాలో రోడ్డు భద్రత ఫోర్స్‌ వాలంటీర్స్‌ బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు.

నెలాఖరులోపు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో రోడ్‌ సేఫ్టీ కమిటీల సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. రవాణా శాఖ, ఆర్టీసీ, పోలీస్‌, ట్రాఫిక్‌, విద్యా శాఖ, సంక్షేమ శాఖల అధికారులు సమన్వయం చేసుకొని రోడ్‌ సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. రోడ్డు నిబంధనలపై విద్యార్థులకు , డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి మరణాల రేటును నివారించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కే రామకృష్ణారావు, స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌రాజ్‌, రవాణాశాఖ కమిషనర్‌ ఇలంబర్తి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -