టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ
బంజారాహిల్స్‌లో పర్యటన
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ బస్తీల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు తోడు భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ అధికారులకు సూచించారు. అవసరానికి మించి కట్టలు కట్టలుగా కిందికి వేలాడుతూ బాటసారులు, విద్యుత్ సిబ్బందికి అపాయకరంగా పరిణమించిన కేబుళ్లను తొలగించాలని చెప్పారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా బస్తీలు, కాలనీల్లో ఇండ్ల ముందు ప్రమాదకరంగా ఉన్న ఎల్‌టీ నెట్‌వర్క్ ఓవర్ హెడ్ లైన్లను ఎయిర్ బంచెడ్ కేబుల్‌తో మార్పిడి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ సర్కిల్ పరిధిలోని మోతీనగర్, ఇందిరానగర్ బస్తీ, హెచ్‌ఎఫ్ నగర్ బస్తీ, బోరబండ సైట్ 2 బస్తీలోని పలు వీధుల్లో మంగళవారం ఆయన కాలినడకన తిరుగుతూ, ఎల్‌టీ నెట్‌వర్క్‌ను తనిఖీ చేసిన సీఎండీ స్థానిక ప్రజలతో మాట్లాడారు. తమ సంస్థ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఇండ్లకు దగ్గరగా ఉన్న ఓవర్ హెడ్ లైన్ స్థానంలో ఏబీ కేబుల్‌ను అమర్చడం పట్ల బస్తీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎండీ వెంట సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్) డాక్టర్ నర్సింహులు, మెట్రో జోన్ చీఫ్ ఇంజినీర్ ప్రభాకర్, సూపరింటెండింగ్ ఇంజినీర్ కరుణాకర్‌బాబు, డివిజనల్ ఇంజినీర్ భీమా నాయక్ తదితర అధికారులు ఉన్నారు.
బస్తీల్లో భద్రతకు ప్రాధాన్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES