బ్రెజిల్ తరపున పాల్గొంటున్న మూడు వేలమంది ఆదివాసీలు
బెలెమ్ : ఆదివాసీల ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసేందుకు బ్రెజిల్ అనేక చొరవలు, కార్యక్రమాలను చేపట్టింది. ఈ నేపథ్యంలో దాదాపు 3వేలమంది ఆదివాసీలు ఇక్కడ బెలెమ్‌లో 12 రోజుల పాటు జరగనున్న వాతావరణ సదస్సుకు హాజరవుతారని భావిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు, గ్లోబల్ వార్మింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆదివాసీ కమ్యూనిటీలు, వారి ప్రాంతాల సరిహద్దులను గుర్తించడం చాలా కీలకమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అమెజాన్ అటవీ ప్రాంత నగరమైన బెలెమ్‌లో తొలిసారిగా కాప్ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల ఆదివాసీల పాత్రను ప్రముఖంగా తెలియచెప్పడానికి ఇదొక విశిష్టమైన అవకాశంగా వుంది. కాప్ 30లో స్థానికుల వాణి మరింత బిగ్గరగా వినిపించడానికి బ్రెజిల్ ప్రభుత్వం పలు చొరవలు తీసుకుంది. మొత్తంగా 3వేల మంది ఆదివాసీలు పాల్గొంటుండగా దాదాపు వెయ్యిమంది బ్లూ జోన్ కింద ప్రతినిధి బృందాల మధ్య జరిగే అధికార చర్చల్లో ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. మిగిలిన 2వేల మంది గ్రీన్ జోన్ కింద పౌర సమాజ సంస్థలు, యువజన గ్రూపులు, కార్యకర్తలు, ప్రజలకు కేటాయించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బ్రెజిల్ ఆదివాసీ ప్రజల వ్యవహారాలు చూసే మంత్రి సోనియా గుజ్జారా యూరోన్యూస్‌తో మాట్లాడుతూ, నిర్ణయాక క్రమంలో, అంతర్జాతీయ వేదికలపై ఆదివాసీలను కూడా పాల్గొనేలా చేయాలన్నది తమ ప్రయత్నమన్నారు. వాతావరణ సంక్షోభాన్ని తగ్గించడానికి పరిష్కార మార్గాలను మనం అన్వేషిస్తున్నాం. ఈ ఆదివాసీలు, వారు నివసించే భూభాగాల్లో వారు జీవ వైవిధ్యాన్ని బాగా పరిరక్షిస్తున్నారని, అడవులను సంరక్షిస్తున్నారని రుజువైంది కనుక వారికి కూడా ఇందులో పాత్ర వుండాలని కోరుకుంటున్నామన్నారు.
కాప్ 30 సదస్సులో ఆదివాసీలకు ప్రాధాన్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



