Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్పార్టీజెండా మోసిన వారికి ప్రాధాన్యత

పార్టీజెండా మోసిన వారికి ప్రాధాన్యత

- Advertisement -
  • ముధోల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నారాయణరావు పటేల్ ..
    నవతెలంగాణ – ముధోల్
    : మొదటినుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి, జెండా మోసిన కార్యకర్తలకి పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని ముధోల్  నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నారాయణరావు పటేల్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో జిఎం పంక్షన్ హాల్లో గురువారం ముధోల్, బాసర, తానుర్, మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో జెండా మోసిన వారికి పదవులు వస్తాయని ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ వచ్చినప్పుడు నుండి  పార్టీలో మొదటి నుండి ఉన్న వారికే  పార్టీ పదవుల్లో, నామినేట్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఈ సమావేశం తేదీ ముందే ప్రకటించినప్పటికీ, కొంతమంది వాయిదా కోసం ప్రయత్నించిటం సరికాదని అన్నారు. ముందుగా ప్రకటించిన ప్రకారమే ఈ సమావేశం పార్టీ ఆదేశానుసారం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ముధోల్ తానూర్, బాసర మండలాల  బ్లాక్, కాంగ్రెస్ కమిటీ, మండల అధ్యక్షులు, కోసం కార్యకర్తలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా కార్యకర్తల అభిప్రాయం మేరకు పదవులకోసం ఎంపిక చేసిన పేర్లను సీల్డ్ కవర్ లో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందజేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేస్తుందన్నారు. సన్న బియ్యం మహిళలకు బస్సు ఫ్రీ, తదితర పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేని అన్నారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ,బాసర ,తానుర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గంగారెడ్డి, మమ్మాయి రమేష్, మురళి బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ముత్యం రెడ్డి, శంకర్ చంద్రే , నాయకులు ప్రేంనాద్ రేడ్డి, కిషన్ పటేల్, రావుల శ్రీనివాస్, చంద్రకాంత్ యాదవ్, అజీజ్,దిగంబర్, నజీబ్, రాంనాద్, నగేష్, ఆయా మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad