Saturday, February 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్య, వైద్యంతో పాటు మౌలిక సౌకర్యాలకు ప్రాధాన్యం..

విద్య, వైద్యంతో పాటు మౌలిక సౌకర్యాలకు ప్రాధాన్యం..

- Advertisement -

22వ వార్డు అభివృద్ధి ప్రణాళిక విడుదల 
నవతెలంగాణ – సదాశివపేట 

22వ కౌన్సిలర్ అభ్యర్థి గారెల గౌరీదేవి తుల్జారం విద్య, వైద్యంతో మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం వార్డు అభివృద్ధి ప్రణాళికను విడుదల చేశారు. వార్డు ప్రజలు తనకు అవకాశం కల్పించి సేవ చేసే భాగ్యం కల్పిస్తే వార్డులో విద్య, వైద్యం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని గారెల గౌరీదేవి తుల్జారం హామీ ఇచ్చారు. నిరుపేదలకు సంవత్సరానికి ఉచిత పుస్తకాలు, నోట్ బుక్కులు, నెలవారి మందులు అందిస్తానని, మూడు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపులు నిర్వహించి నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తానన్నారు.

వార్డులోని నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల పుట్టిన కుటుంబానికి రూ,11,000 తోపాటు జిటిఆర్ కిట్ అందజేస్తామని, నిరుపేద ఆడపిల్ల పెండ్లికి కట్నంగా రూ,25 వేలు అందజేస్తామన్నారు. అదేవిధంగా ఆర్ఓ వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేసి 20 లీటర్ల క్యాన్ ను రూ, 5 రూపాయలకే అందిస్తామని తెలిపారు. వార్డు ప్రజలు ఆదరించి బ్యాట్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని విన్నపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -