Thursday, May 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజగిత్యాల కోర్టునుండి ఖైదీ పరార్

జగిత్యాల కోర్టునుండి ఖైదీ పరార్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోర్టు ఆవరణలో విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకొచ్చిన ఓ రిమాండ్ ఖైదీ పోలీసుల కళ్ళుగప్పి పరారైన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన జున్ను ప్రసాద్ అనే వ్యక్తి, గల్ఫ్‌కు పంపిస్తానని చెప్పి పలువురిని మోసం చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుల్లో అరెస్ట్ అయిన ప్రసాద్, ప్రస్తుతం జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఇటీవలే ఇతనిపై కొడిమ్యాల పోలీస్ స్టేషన్‌లో మరో కేసు కూడా నమోదైంది. ఈ కొత్త కేసుకు సంబంధించి విచారణలో భాగంగా, కొడిమ్యాల పోలీసులు నిన్న పీటీ వారెంట్‌పై జున్ను ప్రసాద్‌ను జగిత్యాల సబ్ జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. కేసు వివరాలను పరిశీలించిన సంబంధిత మేజిస్ట్రేట్, ప్రసాద్‌కు రిమాండ్ విధించారు. కోర్టు ప్రక్రియ ముగిసిన అనంతరం, ప్రసాద్‌ను బయటకు తీసుకువచ్చారు. ఆ సమయంలో కోర్టు ఆవరణలో ఉన్న తన కుటుంబ సభ్యులతో ప్రసాద్ మాట్లాడుతున్నాడు. ఇదే సమయంలో, ఎస్కార్ట్‌గా వచ్చిన కానిస్టేబుల్ సాగర్, రిమాండ్ వారెంట్ తీసుకునేందుకు కోర్టు లోపలికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన జున్ను ప్రసాద్ కానిస్టేబుల్ సాగర్ కళ్లుగప్పి అక్కడి నుంచి వేగంగా పారిపోయాడు. దీంతో ఖైదీ తప్పించుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వెంటనే అప్రమత్తమైన ఖైదీకోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -