- Advertisement -
– ఎంపీల అరెస్టులు అప్రజాస్వామ్యం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజాస్వామ్యం కోసం పోరాటం ప్రారంభించి, ప్రతి భారతీయుని ఓటుకున్న పవిత్ర శక్తి పునరుద్ధరణ కోసం నిలబడ్డ రాహుల్ గాంధీ గొంతుకను జైళ్లు నిర్బంధించలేవని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులను నిర్బంధించే దారుణమైన చర్యకు బీజేపీ పాల్పడిందని ఆయన పేర్కొన్నారు. నిర్బంధంతో రాహుల్‌గాంధీకున్న ధృఢ సంకల్పాన్ని ఆపలేరని హెచ్చరించారు.
- Advertisement -