Saturday, October 4, 2025
E-PAPER
Homeఖమ్మంబిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డులో ప్రయివేట్  కంపెనీల భాగస్వామ్యం రద్దు చేయాలి

బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డులో ప్రయివేట్  కంపెనీల భాగస్వామ్యం రద్దు చేయాలి

- Advertisement -

– సీఐటీయూ జిల్లా అద్యక్షులు బ్రహ్మా చారి
నవతెలంగాణ – అశ్వారావుపేట

బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డులో ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల భాగస్వామ్యాన్ని రద్దుచేయాలని అని,జీవో నెంబర్  12 ను సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారానే సహజ, ప్రమాద, మరణం, పాక్షిక, పూర్తిస్థాయి, అంగవైకల్యం లకు ఇచ్చే సంక్షేమ నిధులను ప్రయివేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు బదిలీ చేసి రూ.346 కోట్లను వెంటనే వాపస్ తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అద్యక్షులు కె.బ్రహ్మా చారి డిమాండ్ చేసారు. 

సీఐటీయూ అనుబంధ బిల్డింగ్ అండ్ అధర్ కన్స్ట్రక్షన్ సంఘం జిల్లా 4 వ మహాసభలను శనివారం అశ్వారావుపేట లోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో నిర్వహించారు. సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని వెంటనే అనుభవజ్ఞులైన ట్రేడ్ యూనియన్ నాయకులతో నియమించాలి అని ప్రభుత్వంలోని అధికారులు, వెల్ఫేర్ బోర్డు నిధులను తమ ఇష్టానుసారం బదిలీ చేయడం ఖర్చు పెట్టడం చట్ట విరుద్ధం అని అన్నారు. 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు కనీసం రూ. 9000 లు తో పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి అని, పెళ్లి కానుక, ప్రసూతి కానుకను రూ.30 వేల నుండి రూ.1 లక్ష వరకు పెంచాలి అని డిమాండ్ చేశారు.

సహజ మరణం కు ఇస్తున్న రూ. 1,30,000 లు ను రూ.5 లక్షలకు పెంచాలి అని, వెల్ఫేర్ బోర్డు కార్డు ఉండి అర్హత కలిగిన కార్మికుల సొంత ఇంటి నిర్మాణం కు రూ. 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం బోర్డు ద్వారా ఇవ్వాలి అన్నారు.కార్మికుల పిల్లల చదువులకు స్కాలర్షిప్ ను బోర్డు ద్వారా ఇవ్వాలి అని, కార్మికులు పనిచేసే పనిముట్ల కు కనీసం రూ.10 వేలకు తగ్గకుండా ఆర్థిక సహాయం అందించాలి అని అన్నారు.

బోర్డులో నమోదై,రెన్యువల్ కానీ 12 లక్షల 15 వేల  కార్డులను వెంటనే రెన్యువల్ చేయాలి డిమాండ్ చేసారు. బోర్డు సెక్రటరీ ఆఫీసులలో జరిగే అవినీతిని అరికట్టాలి అని, బ్రోకర్లు అవినీతి అధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు. 1998 సెస్ చట్టం ద్వారా వసూలు చేసిన సంక్షేమ నిధులను  కార్మికుల కే ఖర్చు పెట్టాలి అని,వలస కార్మికుల చట్టం 1979 భవన ఇతర నిర్మాణ కార్మికుల చట్టం 1996 సంక్షేమ నిధి సెస్ చట్టం 1998 ని పునరుద్ధరించి పకడ్బందీగా అమలు చేయాలి అన్నారు.

ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 4 కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి అని, పట్టణాల్లో ని అడ్డా ప్రాంతాల్లో షెడ్లు,మరుగుదొడ్లు,మంచినీరు,రూ.5 రూపాయలకే భోజనం సదుపాయం కల్పించాలి అని, ప్రకృతి పరంగా దొరికే ఇసుకను ఉచితంగా వాడుకునే లా అనుమతించాలి అని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో సీఐటీయూ జిల్లా జిల్లా కార్యదర్శి ఉప్పుతల నరసింహారావు మాట్లాడుతూ సీఐటీయూ బిల్డింగ్ వర్కర్స్ ఫెడరేషన్ అనేక పోరాటాలు నిర్వహించిందని ఈ పోరాటాల వల్లే వెల్ఫేర్ బోర్డు ఉందని పేర్కొన్నారు సీఐటీయూ వల్లనే వెల్ఫేర్ బోర్డు సాధించబడిందని ఇప్పుడు వెల్ఫేర్ బోర్డు రక్షించుకునే అందుకోసం సీఐటీయూ ఆధ్వర్యంలో బిల్డింగ్ వర్కర్స్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని జిల్లా కార్యదర్శి ఉప్పుతల నరసింహారావు తెలిపారు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ మహాసభలో మాట్లాడారు. 

మహాసభ ప్రారంభానికి ముందు జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం రాములు యూనియన్ జెండా ను ఆవిష్కరించారు. బిల్డింగ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు ఎర్రంశెట్టి వెంకట రామారావు,నిమ్మల మధు, నాగరాజు,తాళ్లూరు కృష్ణ రుంజా సుధాకర్,కోటమ్మ ,శ్రీను,ఎస్కే జాకీర్,వేణు, సీఐటీయూ నాయకులు రఘు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -