Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పత్తి కొనుగోలు దారులుగా అవతారమెత్తిన ప్రయివేట్ వ్యక్తులు

పత్తి కొనుగోలు దారులుగా అవతారమెత్తిన ప్రయివేట్ వ్యక్తులు

- Advertisement -
  • అమాయకపు రైతులే టార్గెట్..
  • దోపిడి జరుగుతుంటే చోద్యం చూస్తున్న అధికారులు..
    నవతెలంగాణ – కాటారం
  • కాటారం మండలంలోని కాటారం, చిదినేపల్లి, ప్రతాపగిరి, కొత్తపల్లి, దేవరాంపల్లి, గంగారం గ్రామాల్లో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పత్తి కొనుగోలు దా(లా)రులుగా అవతారం ఎత్తుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే రైతుల వద్ద నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతుల పొట్ట కొడుతున్నారు. రైతుల వద్ద నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు మిల్లర్లకు విక్రయిస్తున్నారు. మండల కేంద్రంలో కొన్ని నెలలుగా ఈ తతంగం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు రైతుల్లో, ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం మార్కెట్ యార్డుల్లో (పత్తి కొనుగోలు కేంద్రాల్లో) ధరల పట్టికను ఏర్పాటు చేసి పత్తిని కొనుగోళ్లు జరుపుతారు. దళారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా సంబంధిత అధికారులకు ముడుపులు ముట్టజెప్పి ప్రైవేటుగా వారికి నచ్చిన ధరను రైతులకు అంటగట్టి పత్తిని కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్రేడ్ లైసెన్సు కలిగిన వ్యక్తి మాత్రమే పత్తి వ్యాపారాన్ని కొనసాగించాలి. కానీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పత్తి క్రియ,విక్రయాలు యదేచ్చగా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
  • ఇదే విషయమై జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డిని నవతెలంగాణ సంప్రదించగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి, ప్రభుత్వ అనుమతితో మాత్రమే పత్తి కొనుగోళ్లు జరపాలని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలపై సమిష్టిగా ఉక్కు పాదం మోపాలని, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -