నవతెలంగాణ- జడ్చర్ల
పాఠశాల విద్యార్థులపై ప్రయివేట్ ఉపాధ్యాయులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటన మరువకముందే పట్టణంలోని శ్లోక పాఠశాలలో మరో సంఘటన చోటు చేసుకుంది. మూడవ తరగతి చదువుతున్న సహస్త్రను తెలుగు టీచర్ తలపై కొట్టడంతో తీవ్ర ఇబ్బందికి గురైంది ఇది మొదటిసారి కాదు.. ఇంతకుముందే రెండుసార్లు ఇదే విద్యార్థి పైన ఇంగ్లీష్ ,మాథ్స్ ఉపాధ్యాయులు కూడా తలపై కొట్టడంతో తీవ్ర ఇబ్బందికి గురైన విద్యార్థిని తట్టుకోలేక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై సహస తండ్రి నరేష్ కుమార్ పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవరిస్తున్నారు. పిల్లలకు భయం ఉండాలి కానీ అల్లారి ముద్దుగా పెంచుకున్న పిల్లలను ఎక్కడపడితే అక్కడ కొట్టడంతో వారి భవిష్యత్తుకు హాని కలుగుతుంది. జరగరానిది జరుగుతే ఎవరు బాధ్యత వహిస్తారు అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో పునరావృతం కాకుండా పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నప్పటికీ ఉపాధ్యాయులకు భయపడి పిల్లలు తల్లిదండ్రులకు చెప్పలేక లోలోపల ఆవేదన చెందుతున్నారు. ప్రయివేట్ పాఠశాలల పైన కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
పసి పిల్లలపై ప్రతాపం చూపిస్తున్న ప్రయివేట్ పాఠశాల ఉపాధ్యాయులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



