Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రయివేట్ పాఠశాలలు బతుకమ్మ సంబరాలు

ప్రయివేట్ పాఠశాలలు బతుకమ్మ సంబరాలు

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని సిద్ధార్థ విద్యాలయం, చైతన్య విద్యానికేతన్ పాఠశాల, విజ్ఞాన్ పాఠశాలలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు బతుకమ్మ పండుగ గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మలను చేసి పాఠశాల ఆవరణలో బతుకమ్మ పండగ ఆటపాటలు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్థానిక చెరువులో బతుకమ్మను వేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల కరస్పాండెంట్, ప్రధానోపాధ్యాయులు సుధాకర్, శ్రీకాంత్, విజయ భాస్కర్ రెడ్డి, రేణు కుమార్, అశోక్ యాదవ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -