- Advertisement -
- – నాయకత్వం వహించిన ఎంపీ చామల నవతెలంగాణ – ఆలేరు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం వివక్ష వల్ల ఏర్పడిన యూరియా కొరత కు నిరసన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రతో కలిసి మంగళవారం నాడు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీలోని మకర్ద్వార్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణకు రావలసిన 3.5 మెట్రిక్ టన్నుల యూరియాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి కేంద్ర మంత్రి నడ్డాకు తెలంగాణలో యూరియా కొరత తెలంగాణకు రావలసిన వాటా పై వివరించడం జరిగిందన్నారు.
ఆరోజు కేంద్రమంత్రి నడ్డా సానుకూలంగా స్పందించారు. అయినా తెలంగాణలో సమస్య తీరకపోవడంతో తిరిగి నేడు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకు నిరసన కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.ఈరోజు సాయంత్రం కల్లా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావలసిన యూరియా విషయం లో స్పందించకుంటే స్పష్టమైన కార్యాచరణతో యూరియా కొరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి రఘురాంరెడ్డి గడ్డం వంశి కడియం కావ్య బలరాం నాయక్ పాల్గొన్నారు.
- Advertisement -