Monday, March 16, 2026
E-PAPER
Homeజాతీయంఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్‌పై ఎంపీ ప్రియాంక గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్‌పై ఎంపీ ప్రియాంక గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇటీవ‌ల విడుద‌లైనా ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ పై కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ ప్రియాంక గాంధీ విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ నిర్ణ‌యం ప్ర‌కార‌మే ఐదు రాష్ట్రాల్లో ఎల‌క్ష‌న్‌ షెడ్యూల్ వెలువ‌డింద‌ని ఆరోపించారు. ఈ త‌ర‌హా ప్ర‌క‌ట‌న‌పై బీజేపీ హ‌స్తముంద‌ని మండిప‌డ్డారు. తేదీ నుంచి ఎన్ని ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌నే విష‌యాల‌న్ని బీజేపీ నిర్ణ‌యం ప్ర‌కారం జ‌రిగింద‌ని ఆమె పార్ల‌మెంట్ ఎదుట మీడియా స‌మావేశంలో మాట్లాడారు.

పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీలలో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. కేరళ, అస్సాంలో ఏప్రిల్ 9న ఒకే దశలో ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. తమిళనాడులో ఏప్రిల్ 23న, పుదుచ్చేరిలో కూడా పోలింగ్ ఏప్రిల్ 9న జ‌ర‌గ‌నుంది. నాలుగు రాష్ట్రాలు మరియు పుదుచ్చేరి ఓట్ల లెక్కింపు మే 4న వెల్ల‌డించ‌నున్న‌ట్లు ఈసీఐ ఆదివారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ప్రస్తుత అసెంబ్లీల పదవీకాలం వేర్వేరు తేదీలలో ముగియనుంది. పశ్చిమ బెంగాల్‌లో మే 7, తమిళనాడులో మే 10, అస్సాంలో మే 20, కేరళలో మే 23 మరియు పుదుచ్చేరిలో జూన్ 15.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -