Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మార్చ్ ఫాస్ట్ విజేతలకు బహుమతుల ప్రధానం

మార్చ్ ఫాస్ట్ విజేతలకు బహుమతుల ప్రధానం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని అమీర్ నగర్ మండల పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 69వ మండల అంతర్ పాఠశాలల క్రీడోత్సవాల్లో భాగంగా నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన పాఠశాలలకు బహుమతులను అందజేశారు. క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా మార్చ్ ఫాస్ట్ లో విజేతలుగా నిలిచిన ఆయా పాఠశాలలకు బహుమతులను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో పీఎం శ్రీ చౌట్ పల్లి ప్రథమ బహుమతి గెలుచుకోగా, పీఎం శ్రీ కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,  బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంయుక్తంగా ద్వితీయ బహుమతి గెలుపొందాయి.

హాస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత  తృతీయ బహుమతి గెలుపొందగా, మార్చ్ ఫాస్ట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆతిథ్య అమీర్ నగర్ మండల పరిషత్ ఉన్నత పాఠశాల ఉత్తమ ప్రతిభ షీల్డ్ దక్కించుకుంది.ప్రైవేట్ పాఠశాలల విభాగంలో విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాల ప్రథమ బహుమతిని, కృష్ణవేణి ఉన్నత పాఠశాల ద్వితీయ, శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాల తృతీయ బహుమతిని, మిసిమి ఉన్నత పాఠశాల కన్సోలేషన్ బహుమతిని గెలుచుకున్నాయి.

గెలుపొందిన పాఠశాలల విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి షీల్డ్ లను ప్రధానం చేశారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, తహసిల్దార్ గుడిమెల ప్రసాద్, మండల విద్యాధికారి ఆంధ్రయ్య, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పవన్, క్రీడల కన్వీనర్ రాజ్ కిరణ్, సింగిల్ విండో చైర్మన్ సామా బాపురెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల రాజన్న, విలేజ్ ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షులు క్యాతం గంగారెడ్డి, ఉపాధ్యక్షులు పుప్పాల నరసయ్య, కోశాధికారి గుర్రం నరేష్, గ్రామ అభివృద్ధి కమిటీ  అధ్యక్షులు పుప్పాల గంగాధర్, ఉపాధ్యక్షులు క్యాతం రాజేందర్, కోశాధికారి సరాత రఘు,  అన్ని సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, అన్ని ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad