- Advertisement -
నవతెలంగాణ – భీంగల్
సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో నిర్వహించిన వాలీబాల్ క్రీడల్లో మండలంలోని సుదర్శన్ నగర్ తాండ మంచి ప్రతిభ కనబరచి మొదటి స్థానన్ని గెలుచుకున్నారు. బుధవారం ఎంపీడీవో, ఏపీవో, ఎమ్మార్వో ఆధ్వర్యంలో బాబా పూర్ గ్రౌండ్ లో సీఎం కప్ క్రీడలు ప్రారంభించారు. బుధవారం,గురువారం నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలలో వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరిచిన సుదర్శన్ నగర్ తండా మొదటి స్థానంలో, తాళ్లపల్లి రెండవ స్థానంలో గెలుపొందారు. గెలుపొందిన వారికి ప్రైస్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ నగర్ సర్పంచ్ వసుంధర, ఉప సర్పంచ్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


