Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రధానం

వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రధానం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని చౌట్ పల్లి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాచరచన పోటీల్లో విజేతలకు నగదు బహుమతులను అందజేశారు.ఈ మేరకు శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మానవ సంబంధాలపై టెక్నాలజీ ప్రభావం అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతితో పాటు మెమొంటో ను అందించి శాలువాతో సత్కరించారు. మొదటి బహుమతి జి. ప్రణవి( విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాల) రూ.1116, ద్వితీయ బహుమతి ఎస్.షాలిని(ఉప్లూర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల)రూ.751, తృతీయ బహుమతి ఎస్.ప్రణవి( చౌట్ పల్లి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల) రూ.501, ప్రోత్సాహక బహుమతి ఎం.జయశ్రీ( మిసిమి ఉన్నత పాఠశాల), గుడ్ ప్రజెంటేషన్ వి.వినూత్న( విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాల) బహుమతులను గెలుపొందారు.

విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మండల విద్యాధికారి ఆంధ్రయ్య చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ మండల అధ్యక్షులు లుక్క గంగాధర్ మాట్లాడుతూ లైన్స్ క్లబ్ కోశాధికారి తెడ్డు రమేష్ గారి తండ్రి తెడ్డు గంగారం జ్ఞాపకార్థం విద్యార్థుల్లో టెక్నాలజీ వల్ల జరుగుతున్న నష్టాలను, మానవ సంబంధాల విలువలను తెలియజేసే విధంగా ఈ అంశాన్ని ఎన్నుకొని విద్యార్థులకు మండల స్థాయిలో వ్యతిరచన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు వారి అభిప్రాయాలను వ్యాసరచన పోటీల్లో చక్కగా వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుపల్లి సింగిల్ విండో చైర్మన్ కుంట ప్రతాప్ రెడ్డి, లైన్స్ క్లబ్ కార్యదర్శి రేవతి గంగాధర్, సభ్యులు చింత ప్రదీప్, బద్దం రాజశేఖర్, సురంగి చంద్రశేఖర్, చిలువేరి పవన్ కుమార్, సుంకరి విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad